ఏడుపాయల ఆలయం తాత్కాలికంగా మూసివేత - రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ప్రతిష్ఠించి పూజలు - Edupayala Temple Closed - EDUPAYALA TEMPLE CLOSED
🎬 Watch Now: Feature Video
Published : Oct 1, 2024, 1:27 PM IST
Edupayala Temple Closed : మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయానికి వరద ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆలయ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆలయ అర్చకులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లి తెల్లవారుజామున మంజీరా జలాలతో అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు చేసి ఏడుపాయల ప్రధాన ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. వనదుర్గకట్ట, గర్భగుడి వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సింగూర్ నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో మంజీరా నది పరీవాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు మంజీరాలోనికి చేపలు పట్టడానికి వెళ్లకూడదని నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. నీటి ఉద్దృతి పెరగడంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.