వైభవంగా సింహాచలం గిరిప్రదక్షిణ - భారీగా పాల్గొన్న భక్తులు - Giri Pradakshina Celebrations 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 10:35 PM IST
Devotees Celebrate Simhachalam Giri Pradakshina Festival in Visakha : సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా విశాఖలోని పలు రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. భక్తులు లక్షలాది మంది తరలివచ్చి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు. తొలి పావంచా నుంచి అడవివరం, హనుమంతవాక, అప్పుఘర్, ఇసుకతోట, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, NAD జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా మళ్లీ తొలిమెట్టు వరకు 32 కిలో మీటర్ల మేర భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారు. గిరిప్రదక్షిణ సాగే మార్గంలో ప్రతి అరకిలోమీటరకు ఒక కౌంటర్ ద్వారా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి పరిశీలిస్తున్నారు.
సింహాచలం తొలి పావంచాకు చేరుకునేందుకు వచ్చే భక్తుల కోసం బస్సులు కేవలం బీఆర్ టీఎస్ రోడ్డు వరకు మాత్రమే నడపడం, బస్సుల దారి మళ్లింపు వల్ల NAD జంక్షన్, గోపాల పట్నం రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు ఆగిపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. ఆదివారం ఉదయం గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగియనుంది. మునుపెన్నడూ లేనంత భక్తుల రద్దీ ఈ ఏడాది ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు సింహాచలం గిరి ప్రదక్షిణ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు.