వీలైనంత త్వరగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి - MLA Madhusudhan Reddy on Palamuru
🎬 Watch Now: Feature Video
Published : Mar 1, 2024, 7:18 PM IST
Devarakadra MLA Madhusudhan Reddy Face2Face : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శనలో భాగంగా ఏఐసీసీ (A.I.C.C) కార్యదర్శి వంశీ చంద్‌రెడ్డితో పాటు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కరివెన జలాశయాన్ని సందర్శించారు. ఇప్పటికే 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాలని, అందుకే జలాశయాలను సందర్శించామని తెలిపారు.
MLA Madhusudhan Reddy Interview : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35,500 కోట్లు అని, ఇప్పటికే రూ.28 వేల 12 కోట్లు ఖర్చు అయిందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కోట్లు ఖర్చు చేసి కనీసం 28 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామంటున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో ముఖాముఖి.