LIVE - తుక్కుగూడ బహిరంగ సభా ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు - DEPUTY CM BHATTI LIVE - DEPUTY CM BHATTI LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 4, 2024, 2:32 PM IST
|Updated : Apr 4, 2024, 2:47 PM IST
Ministers Inspect to Tukkuguda Congress Meeting Arrangements : తెలంగాణ, కర్ణాటక శాసనసభ ఎన్నికల విజయాల స్ఫూర్తిని లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తున్న కాంగ్రెస్ తుక్కుగూడ వేదికగా ఈనెల 6న దేశవ్యాప్త ప్రచారానికి సమరశంఖం పూరించనుంది. దీంతో సభా ప్రాంగణం తదనుగుణంగా ముస్తాబవుతోంది. గతేడాది సెప్టెంబరు 17న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్కడి నుంచే సమరభేరి మోగించి ఆరు గ్యారంటీలు ప్రకటించగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అక్కడి నుంచే జాతీయస్థాయి మేనిఫెస్టో ప్రకటించనుంది. జనజాతర పేరిట తుక్కుగూడలో నిర్వహించనున్న బహిరంగ సభ ద్వారా అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అమలు చేయనున్న అయిదు గ్యారంటీలతో పాటు ఇతర హామీలను ప్రకటించనుంది. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీతో పాటు జాతీయ నేతలు హాజరుకానున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు సైతం తుక్కుగూడ సభ వేదికగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. మీటింగ్ ఏర్పాట్లను స్వయంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు.
Last Updated : Apr 4, 2024, 2:47 PM IST