అమెరికా డాలర్లతో గణపతికి అలంకరణ - మీరూ చూసేయండి - Ganesh Decor With Dollar - GANESH DECOR WITH DOLLAR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 6:53 PM IST

Updated : Sep 8, 2024, 7:41 PM IST

Decoration of Ganesha With Dollar in Vemulawada : వినాయక పండుగ వచ్చిదంటే చాలు ప్రతి గల్లీలో సందడే. ప్రతి ఒక్కరు తమ గణపతిని, మండపాన్ని ఇతరులకంటే అందంగా అలంకరించాలని పోటీ పడుతుంటారు. పండగకు నెల రోజుల ముందు నుంచే మండపాల ఏర్పాటు ప్రారంభిస్తారు. కొందరు నిర్వాహకులు పండుగ మొదలైన ఒకటో రోజు నుంచి బొజ్జ గణపయ్యను రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు కనివిందు కలిగించేందుకు ప్రయత్నిస్తారు. ఒకరోజు కూరగాయలతో, డబ్బులతో, పండ్లతో ఇలా వివిధ రకాలుగా గణేశుడిని ముస్తాబు చేసి తమ భక్తిని చాటుకుంటారు. 

తాజాగా వేములవాడ పట్టణంలోని బుద్ది పోచమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్‌ అలంకరణ అందరిని ఆకట్టుకుంటుంది. వినాయకుడుని ప్రతిష్టించిన మొదటిరోజే 1000 అమెరికా డాలర్లతో చేసిన దండతో అలంకరించారు. వాటిని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే పట్టణానికి చెందిన న్యాయవాది నేరెళ్ల తిరుమల గౌడ్ అమెరికా డాలర్లను అందించడంతో గణనాథుడిని ముస్తాబు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ డాలర్ గణపతిని చూసేందుకు స్థానికులు బారులు తీరుతున్నారు.

Last Updated : Sep 8, 2024, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.