'సమాజం కోసం సేవ చేసేందుకు మమ్మల్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేయండి' - BRS MLC Candidates Met Governor
🎬 Watch Now: Feature Video
Published : Mar 11, 2024, 7:52 PM IST
Dasoju Sravan And Kurra Satyanarayana Met Governor : హైకోర్టు తీర్పు ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని గవర్నర్‌కు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వినతి పత్రం ఇచ్చారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న శ్రవణ్, న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగిందని హర్షం వ్యక్తం చేశారు. బడుగువర్గాలకు చెందిన తాము ఎంతో కష్టపడి ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేస్తూ ఈ దశకు వచ్చామని, ప్రజా సేవ చేసే అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరారు.
Dasoju Sravan on MLC Nomination : కోర్టు తీర్పు పరిశీలించి న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీ మారినా పదవులు, కాంట్రాక్టుల కోసం పాకులాడలేదని శ్రవణ్ వ్యాఖ్యానించారు. ప్రజా గొంతుకగా ఉండి ఎన్నో పోరాటాలు చేసిన తమను గుర్తించాలని అన్నారు. ఆర్టికల్ 191 ప్రకారం తాము ఎలాంటి అనర్హతకు వర్తించమని చెప్పారు. తమను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి న్యాయం చేయాలని గవర్నర్‌ను కోరారు.