ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు - శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం - Dasara Sharan Navaratri Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2024, 8:00 AM IST
|Updated : Oct 5, 2024, 9:30 AM IST
Dasara Sharan Navaratri Live : అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా శోభను సంతరించుకుంది. శరన్నవరాత్రి మహోత్సవాల వేళ బెజవాడ భక్తులతో కిటకిటలాడుతోంది. శక్తిపీఠాలలో ఒకటిగా విజయవాడ కనకదుర్గాదేవి ఆలయానికి పేరు. ఈ క్రమంలోనే ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. 4500 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు 18 చోట్ల ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. కేశఖండన కోసం షిప్టుకు 200 మంది క్షురకులను అందుబాటులో ఉంచారు. నదీ స్నానాలు కాకుండా సీతమ్మ వారి పాదాల వద్ద భారీగా షవర్లు ఏర్పాటు చేశారు. కృష్ణానది పవిత్ర హారతుల దృష్ట్యా దుర్గా ఘాట్ వద్దకు భక్తులను అనుమతించడం లేదు.
Last Updated : Oct 5, 2024, 9:30 AM IST