LIVE : విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శనలో కేంద్ర మంత్రులు ప్రత్యక్ష ప్రసారం - CENTRAL MINISTER VISIT STEEL PLANT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2025, 4:19 PM IST
|Updated : Jan 30, 2025, 4:25 PM IST
Central Minister Kumaraswamy Visit Visakha Steel Plant LIVE : కేబినెట్ మంత్రి హెచ్డీ కుమారస్వామి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఉపయోగించుకొని విశాఖ స్టీల్‌ప్లాంట్ 7.3 మిలియన్ టన్నుల పూర్తిస్థాయి వార్షిక ఉత్పత్తి చేరుకున్న తర్వాత దాన్ని సెయిల్‌లో విలీనం చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రుల త్యాగాలతో నెలకొల్పిన ఈ ప్లాంట్‌ను కాపాడాలన్న ఉద్దేశంతోనే కేంద్రం రూ.11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని గుర్తుచేశారు.అందువల్ల దాన్ని ప్రైవేటీకరిస్తారన్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్లడంపై యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులతో సంప్రదించి సలహాలు తీసుకోవడానికి తాము విశాఖ వచ్చినట్లు సమాచారం. విశాఖ ప్లాంట్ కార్మికులకు మూడు నెలల వేతన బకాయిలు రూ.240 కోట్లు ఉన్నాయని. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో కేెంద్ర మంత్రుల పర్యటన ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jan 30, 2025, 4:25 PM IST