వైఎస్ షర్మిల, సునీతపై అసభ్యపోస్ట్​లు పెడుతున్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్ - comments on Sunita

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 3:44 PM IST

Cyber crime police registered a case against Ravinder Reddy: సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై సునీత రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 509, 506 తో పాటు 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. తనతో పాటు సోదరి, ఎపీ పీసీసీఛీఫ్‌ షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో సునీతా పేర్కొన్నారు. అసభ్య పదజాలం తో దూషిస్తు పోస్టింగ్ లు పెడుతున్నట్లు ఆధారాలు సైతం సమర్పించారు. 'శత్రు శేషం ఉండకూడదు, ఇద్దరిని లేపేయ్ అన్నాయ్.. ఎన్నికలకు పనికొస్తారు' అని వర్రా రవీందర్ రెడ్డి పోస్ట్‌ చేసినట్లు తెలిపారు. 

సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడులు: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టింది మెుదలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు వైఎస్ షర్మిల, సునీత రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరపోస్టులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాలలో వారి వ్యక్తిత్వంపై దాడులు చేస్తున్నారు. మార్పింగ్ ఫొటోలు, వ్యంగ చిత్రాలతో ఇబ్బందికర పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన సునీత సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.