బిజీ రోడ్డులో బైక్ స్టంట్స్- ఫ్లైఓవర్‌పై నుంచి స్కూటీలను కింద పడేసిన స్థానికులు- తర్వాత పోలీసులు వచ్చి? - Motorcycle Stunt Riders
🎬 Watch Now: Feature Video
Published : Aug 19, 2024, 10:40 AM IST
Crowd Throws Bikes From Flyover : సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యేందుకు యవత ప్రాణాలకు తెగించి ప్రమాదకర విన్యాసాలు చేస్తూన్నారు. చిన్న తప్పిదం వల్ల ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఎదుటివాళ్లనూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ ఫ్లైఓవర్‌పై కొంతమంది యువకులు ప్రమాదకర స్టంట్‌లు చేయడాన్ని గుర్తించిన స్థానికులు, వారికి సరైన బుద్ధి చెప్పాలనుకున్నారు. ఈ క్రమంలోనే వారి బైక్‌లను ఫ్లైఓవర్ నుంచి కిందకు పడేశారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
బెంగళూరులోని నెలమంగళ ఫ్లైఓవర్‌పై కొందరు ఆకతాయిలు బైకులతో ప్రమాదకర విన్యాసాలు చేశారు. చుట్టుపక్కన ఉన్నవారి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా రద్దీ రోడ్లపై స్టంట్‌లు చేస్తూనే ఉన్నారు. దీంతో ఎలాగైనా వారికి బుద్ధి చెప్పాలనుకున్న అక్కడి స్థానికులు వారి బైక్‌లను ఫ్లైఓవర్ నుంచి కిందకు పడేశారు. దీంతో భయంతో ఆ రైడర్లు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. స్కూటర్లను పడేసి ప్రజా భద్రతను ప్రమాదంలో పడేసినందుకు గానూ మొత్తం 36 మందిపై కేసు నమోదు చేశారు.