పక్షులు, అడవిపందుల నుంచి రక్షణ - ఈ కెనాన్​తో మీ పంటలు సురక్షితం - Solar Device for Agriculture

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 2:49 PM IST

Crop Protection From Birds  : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అడవిపందులు, పక్షుల నుంచి కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పంటలను రక్షించుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అఖిల భారతీయ సకశేరుక విభాగం వారు ఓ కొత్త పరికరం రూపొందించారు. సులువుగా పంట చేలలోకి తీసుకెళ్లడంతో పాటు పొలాల్లోని ఓ చిన్న చెట్టుకు ఉంటే చాలు. దీన్ని ఓ చెట్టు కొమ్మకు వేలాడ దీసేలా తయారు చేశారు.

 Prof Jayashankar University Innovation for Agriculture  : మనిషి అవసరం లేకుండా పగలు, రాత్రి పక్షులు, అడవి పందులు పంటచేలలోకి రాకుండా ఈ-కెనాన్ అనే ఈ పరికరం 20 రకాల శబ్దాలు చేస్తుంది. పులుల, సింహాల గాండ్రిపులు, గన్, మనుషుల, పక్షుల అరుపుల శబ్దాలతో కూడిన చిప్​ను తయారు చేసి ఈ పరికరంలో పొందుపరిచారు. ఈ పరికరాన్ని సొలార్​తో రూపొందించారని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్​ తెలిపారు. ఈ పరికరాన్ని పగలు 2-3 గంటలు ఛార్జ్​ చేస్తే సుమారు 12 గంటల వరకు పనిచేస్తుందని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.