సీఎం సొంత జిల్లాలో కరెంట్ కష్టాలు - ఎండిపోతున్న పంటలు
🎬 Watch Now: Feature Video
Crop Drying with Power Problems in Badvel: ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇస్తున్నామని ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం కనీసం 7 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో ఎకరాకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు పెట్టుబడి పెట్టి వరి, పత్తి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. కరెంటును సక్రమంగా ఇవ్వకపోవడంతో పంటలు సాగు చేయడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడాల్సిన దుస్థితి ఎదురవుతుంది. రోజుకి ఏడు గంటలు కరెంటు ఇస్తున్నామనడమే కానీ తరచూ బ్రేక్ డౌన్ కారణంగా కోత విధించడంతో పొలాలకు నీటి తడులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో సుమారు 70 వేల ఎకరాల వరకు పంట సాగు చేస్తున్నారు. కొన్ని రోజులుగా విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏడు గంటలపాటు నిలుపుదల చేయకుండా విద్యుత్ అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.