రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న పన్నులు మొత్తం కేంద్రం ఖజానాకే : బీవీ రాఘవులు - CPM Raghavulu protest Against BJP
🎬 Watch Now: Feature Video
Published : Feb 8, 2024, 3:42 PM IST
CPM BV Raghavulu Fires on BJP : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కేరళ ప్రభుత్వంపై రాజకీయంగా, ఆర్థికంగా కేంద్రం వివక్షత చూపుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. కేంద్ర అనుసరించే విధానాలు ఫెడరల్ వ్యవస్థనే పూర్తిగా దెబ్బ తీస్తుందన్నారు. రాష్ట్రాల మీద జరుగుతున్న వివక్షత దాడిని ఎదురించే దానికే కేరళ, ఎల్డీఎఫ్ కూటమి దిల్లీలో ధర్నా చేస్తుందని తెలిపారు. కేంద్రం దేశవ్యాప్తంగా వసూలు చేస్తున్న పన్నుల్లో 60శాతం రాష్ట్రాలకు, 40శాతం కేంద్రానికి వాటా ఉండాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న పన్నులు అంతా కేంద్ర ఖజానాకే పోతుందన్నారు. కేరళ ప్రభుత్వానికి మద్దతుగా హైదరాబాద్లోని ఇందిరా పార్క ధర్నా చౌక్ వద్ద సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసెంబ్లీ సమావేశాల్లో 2014 తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తర్వాత కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు, చేసిన అన్యాయాన్ని లెక్కలతో బయటపెట్టి బీజేపీ సర్కార్ వివక్షను ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు.