సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - MLC jeevan Reddy On Rythu Bandhu - MLC JEEVAN REDDY ON RYTHU BANDHU
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-06-2024/640-480-21717831-thumbnail-16x9-jeevan-reddy.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jun 15, 2024, 3:47 PM IST
Congress MLC jeevan Reddy On Rythu Bandhu : సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందిస్తామని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జగిత్యాలలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని రైతులకు కూడా రైతుబంధు ఇచ్చిందని విమర్శించారు. గుట్టలు, లే అవుట్లకు కూడా రైతుబంధు ఇచ్చారని తెలిపారు. సాగు చేసే రైతులకే రైతు బంధు ఇస్తేనే బాగుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7500 అందిస్తుందన్నారు.
కేంద్రం రైతులకు ఎకరాకు రూ.6 వేలు మాత్రమే ఇస్తుందని, అది రైతు ఖర్చులకు సరిపోదన్నారు. మోదీ రూ.లక్షల కోట్లు అంబానీ, అదానికి దోచిపెట్టారని విమర్శించారు. రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తే దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయవచ్చని విమర్శించారు. కానీ రైతులకు వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే పంజాబ్ రైతులతో సహా అందరూ మోదీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, ఇకనైనా మోదీ కళ్లు తెరవాలన్నారు. రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు.