LIVE : కాంగ్రెస్ జన జాతర సభ ప్రత్యక్ష ప్రసారం - Congress Jana Jatara Sabha Live - CONGRESS JANA JATARA SABHA LIVE
🎬 Watch Now: Feature Video


Published : Apr 6, 2024, 6:36 PM IST
|Updated : Apr 6, 2024, 8:29 PM IST
Congress Jana Jatara Sabha Live : దిల్లీ గద్దెపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సభా వేదికగా కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖాన్ని పూరించనుంది. జాతీయ ఎన్నికల ప్రచారానికి తొలిమెట్టుగా జన జాతర పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ సర్వం సిద్ధం చేసింది. సభా ప్రాంగణంలో మొత్తం మూడు స్టేజీలు ఏర్పాటు చేయగా, ప్రధాన స్టేజీ మీద 300 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. లక్ష మంది మహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 5 వ తేదీన పార్టీ జాతీయ మేనిఫెస్టోను దిల్లీలో సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేశారు. అందుకు సంబంధించిన తెలుగు ప్రతిని నేటి సభలో రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ సభకు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు.
Last Updated : Apr 6, 2024, 8:29 PM IST