LIVE : భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో - revanth Campaign in bhuvanagiri - REVANTH CAMPAIGN IN BHUVANAGIRI
🎬 Watch Now: Feature Video
Published : Apr 21, 2024, 6:48 PM IST
|Updated : Apr 21, 2024, 8:38 PM IST
CM Revanth Tour In Bhuvanagiri Live : భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు అందరు పాల్గొన్నారు. సీఎం ప్రచారంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రోడ్‌షోలో పార్లమెంటు నియోజకవర్గంలోని మునుగోడు, భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగతుర్తిల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టారు. ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన పంచ్ న్యాయ్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో చామల కిరణ్‌కు మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు.
Last Updated : Apr 21, 2024, 8:38 PM IST