LIVE : కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు మీట్‌కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth visit Command Centre - CM REVANTH VISIT COMMAND CENTRE
🎬 Watch Now: Feature Video
Published : Jul 2, 2024, 1:29 PM IST
|Updated : Jul 2, 2024, 1:58 PM IST
CM Revanth Reddy Visit Command Control Centre : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన పోలీసులు మీట్‌కు సీఎం హాజరయ్యారు. అలాగే పోలీసుల ప్రత్యేక వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం ప్రత్యేక వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో కోసం 27 కార్లు, 40 ద్విచక్ర వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం 14 కార్లు, 30 ద్విచక్ర వాహనాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇది రెండోసారి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం. ఇప్పటికే హైదరాబాద్‌లో డ్రగ్స్, సైబర్ నేరాల దాడులు అధికంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
Last Updated : Jul 2, 2024, 1:58 PM IST