LIVE : బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ధి ఉత్సవాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH LIVE
🎬 Watch Now: Feature Video
Published : Aug 25, 2024, 2:54 PM IST
|Updated : Aug 25, 2024, 3:00 PM IST
CM Revanth Reddy Today Live : క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్‌ను వినియోగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ అంత గొప్ప ప్రదర్శన చేయలేదని అన్నారు. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఖేలో ఇండియా నిర్వహణను తెలంగాణకు ఇవ్వాలని కేంద్రానికి విన్నవించామన్నారు. 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని సీఎం వివరించారు. గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం కోకాపేట్ అక్షయ పాత్ర ఫౌండేషన్ సమీపంలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి మాట్లాడారు.
Last Updated : Aug 25, 2024, 3:00 PM IST