LIVE : ఎల్బీనగర్లో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 28, 2024, 7:39 PM IST
|Updated : Apr 28, 2024, 8:13 PM IST
CM REVANTH LBNAGAR ROAD SHOW LIVE : రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో, ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ ఎల్బీనగర్లో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్‌రెడ్డికి మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం రెండు కలిసి పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సరైన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా మహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Apr 28, 2024, 8:13 PM IST