LIVE : సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - CM Revanth Reddy Reaction On Budget - CM REVANTH REDDY REACTION ON BUDGET
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 5:20 PM IST
|Updated : Jul 23, 2024, 5:59 PM IST
CM Revanth Reddy Reaction On Union Budget LIVE : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విభజన చట్టం హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని ప్రజల కోసం పెట్టిందికాదన్నారు. బడ్జెట్‌లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అన్యాయం చేశారని తెలిపారు. తెలంగాణలో ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారని అయినా కేంద్రం తెలంగాణకు నిధులు కేటాయించలేదని ఎద్దేవా చేశారు. రూ. 48 లక్షల ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను ఎంపిక చేసుకుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన - నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, ఆవిష్కరణలు - సంస్కరణలు - ఈ తొమ్మిది అంశాలు ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Last Updated : Jul 23, 2024, 5:59 PM IST