LIVE : కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video
Published : Nov 19, 2024, 2:42 PM IST
|Updated : Nov 19, 2024, 3:29 PM IST
CM Revanth Reddy opens kaloji Kalakshetram : నేడు అపురూమైన కళాక్షేత్రం ఓరుగల్లులో కొలువుతీరింది. ప్రజాకవి కాళోజీ పేరుతో నిర్మించిన కళా ప్రదర్శనల నిలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కాళోజీ కళాక్షేత్రానికి పునాదిరాయి వేసినప్పటికీ నిర్మాణం పూర్తికాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 9 నెల వ్యవధిలో రూ.45 కోట్లను కేటాయించి యుద్ధ ప్రాతిపదికన కాళోజీ కళాక్షేత్రం పనులను చేపట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హనుమకొండ పట్టణంలో ఉన్న హయగ్రీవా చారి మైదానం ప్రాంగణంలో సువిశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో అహ్లాద వాతావరణంలో 95.548 చదరపు అడుగుల కళాక్షేత్రం నిర్మాణం చేశారు. నాలుగు అంతస్తుల భవనంగా నిర్మించిన ఈ కళా క్షేత్రంలో 1127 సీట్ల సామర్ధ్యంతో ఆడిటోరియం ఏర్పాటు చేశారు. సెంట్రలైజర్ ఏసీ అధునాతన హంగులతో సౌండ్ సిస్టమ్ థియేటర్ ప్రదర్శనలు, కళారంగ కార్యక్రమాలకు అనువైనదిగా ఈ కళాక్షేత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారంలో చూద్దాం.
Last Updated : Nov 19, 2024, 3:29 PM IST