జనం బుద్ధిచెప్పినా బీఆర్ఎస్కు బుద్ధిరాలే - అసెంబ్లీలో సీఎం రేవంత్ - Revanth on Tribal Areas Development - REVANTH ON TRIBAL AREAS DEVELOPMENT
🎬 Watch Now: Feature Video
Published : Jul 24, 2024, 1:56 PM IST
CM Revanth on Tribal Areas : తండాల్లో, గూడెంలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తమ ప్రభుత్వం బలంగా భావిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం రోజున తెలంగాణలో జరిగిన శాససభ రెండోరోజు సమావేశాల్లో తండాల్లో, గూడేల్లో ఉన్న విద్యుత్, విద్య, తదితర సమస్యలపై సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం తండా ప్రజలకు సౌకర్యం కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఏడు లక్షల ఇళ్లకు తాగునీరు ఇవ్వలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతల తీరెరిగిన ప్రజలు ఎన్నికల్లో ఓటుతో సరైన గుణపాఠం చెప్పినప్పటికీ మారట్లేదని సభా సాక్షిగా సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలకు మంచిబుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. రోడ్లు సరిగాలేక ప్రమాదాలు జరిగి అనేకమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.