చుక్కా రామయ్యను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి - ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం - CM Revanth Meet Chukka Ramaiah - CM REVANTH MEET CHUKKA RAMAIAH
🎬 Watch Now: Feature Video


Published : May 30, 2024, 9:52 PM IST
CM Revanth Reddy Meet educationist Dr Chukka Ramaiah : జూన్ 2వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి ఆయనను వేడుకలకు రావాలని కోరారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో చుక్కా రామయ్యను సీఎం పరామర్శించారు.
విద్యావేత్త చుక్కా రామయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ఆయనను పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. కాసేపు ఆయనతో ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం చుక్కా రామయ్యను సత్కరించారు. సీఎం వెంట మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులు ఉన్నారు. ఇప్పటికే ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. జూన్ 2న తెలంగాణ గేయం జయ జయహే తెలంగాణ గేయాన్ని ఆవిష్కరించనున్నారు.