LIVE : హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన - Elevated Corridor in Hyderabad
🎬 Watch Now: Feature Video
Published : Mar 9, 2024, 7:07 PM IST
|Updated : Mar 9, 2024, 8:33 PM IST
Elevated Corridor Foundation Stone in Hyderabad Live : హైదరాబాద్ నలుమూలలా అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎలివేటెడ్ కారిడార్, మెట్రో రైల్ విస్తరణలు చేపడుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్-ఆదిలాబాద్ మీదుగా సాగే ఎన్‌హెచ్-44పై సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలు కానుంది. ఇలా మొదలైన కారిడార్ తాడ్‌బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫాం రోడ్డు వద్ద ముగుస్తుంది. రూ.15,80 కోట్ల వ్యయంతో 5.320 కిలోమీటర్ల కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.65 కిలోమీటర్లు, అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్నో ఆటంకాలను అధిగమించి ఈ ఎలివేటెడ్ డబుల్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నేడు శంకుస్థాపన చేశారు. దీంతో నగరంవాసులకు ట్రాఫిక్ నుంచి కాస్త ఉపశమనం లభించినట్లు అవుతుంది. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పాతబస్తీనే అసలైన హైదరాబాద్ అంటూ కొనియాడారు.
Last Updated : Mar 9, 2024, 8:33 PM IST