LIVE : మల్లేపల్లిలో ఐటీఐ స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు సీఎం రేవంత్​ రెడ్డి భూమిపూజ - ITI Skill Development Live - ITI SKILL DEVELOPMENT LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 3:00 PM IST

Updated : Jun 18, 2024, 3:33 PM IST

CM Revanth Reddy  Bhumi Puja for ITI Skill Development Project Live : రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్​తో ఎంవోయూ కుదుర్చుకుంది. యువతకు ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల ఖర్చుతో ఐటీఐలలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అవసరమైన వర్కషాప్​ల నిర్మాణంతో పాటు యంత్రపరికరాల సామగ్రితో పాటు శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్ చేపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐటీఐలలో కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మల్లేపల్లిలో ఐటీఐ స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు సీఎం రేవంత్​ రెడ్డి భూమిపూజ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్​ రెడ్డి భేటీ కానున్నారు.
Last Updated : Jun 18, 2024, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.