రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం - సీఎం రేవంత్ సహా ప్రముఖుల హాజరు - CM Revanth attend AT HOME Program - CM REVANTH ATTEND AT HOME PROGRAM
🎬 Watch Now: Feature Video
Published : Aug 15, 2024, 9:09 PM IST
|Updated : Aug 15, 2024, 9:52 PM IST
CM Revanth attend AT HOME Program : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్‌లో "ఎట్ హోం" కార్యక్రమం ఉత్సాహ భరితంగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన "ఎట్ హోమ్" తేనీటి విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ నేతలు మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఎల్.రమణ్ మినహా నేతలెవరూ హాజరు కాలేదు. ఇటీవల రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి.
ఉదయం రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాఠశాల విద్యార్థులతో ముచ్ఛటించారు.