LIVE : ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth At Firemen POP - CM REVANTH AT FIREMEN POP
🎬 Watch Now: Feature Video
Published : Jul 26, 2024, 11:07 AM IST
|Updated : Jul 26, 2024, 12:10 PM IST
CM Revanth Reddy at Firemen Passing Out Parade Live : ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. కాగా ఫైర్‌మెన్ అభ్యర్థులు నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖకు చెందిన సివిల్, ఏఆర్, ఎస్ఏఆప్సీపీఎస్, టీఎస్ఎస్పీ విభాగాలకు 13వేల 444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాలలో ఎంపికైన వారికి రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు నియామక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లలో భాగంగా శిక్షణా ప్రాంతాల్లో ఉన్న మైదానాలు చదును చేయడం, వారికి వసతి కల్పించడం వంటి అనేక పనులను చేపట్టింది. ఈ శిక్షణార్థుల్లో దాదాపు 2,000 మంది మహిళల కోసం ప్రత్యేకంగా 3 కేంద్రాలను కేటాయించారు. ఈసారి మొత్తం 17,156 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించగా. జైళ్లు, ఫైర్ తదితర విభాగాల పోస్టులు పోనూ 14,881 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు.
Last Updated : Jul 26, 2024, 12:10 PM IST