LIVE : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం - ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ - Minority Residential School
🎬 Watch Now: Feature Video
Published : Mar 8, 2024, 5:33 PM IST
|Updated : Mar 8, 2024, 5:40 PM IST
Telangana Minority Residential School Inauguration Live : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి పూర్తి సహకారం అందిస్తున్నందని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీని షురూ చేస్తామని మాట ఇచ్చామని, ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదల చేసి నిరుద్యోగుల్లో నూతన ఆశలను రేకెత్తించామని అన్నారు. అలాగే మెగా డీఎస్సీ పేరుతో 11వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా విడుదల చేశామని తెలిపారు. గత ప్రభుత్వం మూడు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల ఉద్యోగాలు కల్పించామని ఇటీవలే ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థులకు సరైన వసతులు, ఆహారం అందివ్వాలని సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షలు కూడా సీఎం నిర్వహించారు.
Last Updated : Mar 8, 2024, 5:40 PM IST