LIVE : పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా సదస్సు 2024 - హాజరైన సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth in Mahila Sadassu
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-03-2024/640-480-20967939-thumbnail-16x9-revanth.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 12, 2024, 5:43 PM IST
|Updated : Mar 12, 2024, 7:38 PM IST
CM Revanth at Mahila Sadassu Meeting Live : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీ స్కీముల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహ జ్యోతి, గృహ లక్ష్మి పథకాలను ప్రారంభించి మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పకనే చెబుతున్నారు. నిన్న సోమవారం భద్రాచరంలో గృహ లక్ష్మి పథకాన్ని మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళా సంక్షేమంతోనే రాష్ట్రాభివృద్ధి ముడిపడి ఉందని రేవంత్ రెడ్డి చెబుతూ వచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను లోటుపాట్లను సవరించి అవినీతికి తావు లేకుండా అర్హులైన వారికే ఈ ప్రయోజనాలు అందేలా తమ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు దానిని అమలు చేస్తూ మహిళా సంక్షేమం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించారు. ఈ సంక్షేమ పథకాల గురించి వివరించేందుకు పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా సదస్సు - 2024 సదస్సు నిర్వహిస్తున్నారు.
Last Updated : Mar 12, 2024, 7:38 PM IST