క్లాస్ రూమ్‌లోనే స్విమ్మింగ్ పూల్- విద్యార్థులంతా ఫుల్ ఖుషీగా ఆడుకుంటూ! - Swimming Pool In Govt School - SWIMMING POOL IN GOVT SCHOOL
🎬 Watch Now: Feature Video


Published : May 1, 2024, 7:09 AM IST
Classroom Swimming Pool : ఎండ వేడి నుంచి పిల్లలకు ఉపశమనం కల్పించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాకు చెందిన ఓ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడం వల్ల మహసోనాపూర్ ప్రాథమిక పాఠశాలలోని ఒక తరగతి గదిని ఏకంగా చిన్నపాటి స్విమ్మింగ్ పూల్లాగా మార్చేసింది. తరగతి గదిలో దాదాపు రెండు అడుగుల మేర నీళ్లు నింపింది.
ఇక ఇంకేముంది, నీళ్లను చూడగానే పిల్లల్లో ఒక్కసారిగా హుషారు పొంగుకొచ్చింది! విద్యార్థులంతా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుకున్నారు. ఈత కొడుతున్నట్లు చేతులు, కాళ్లు ఆడిస్తూ సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎండలు ఎక్కువ కావడం వల్ల పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, పొలాల్లో ఆడుకుంటున్నారని ప్రధానోపాధ్యాయుడు వైభవ్ రాజ్‌పుత్ తెలిపారు. అందుకే వినూత్నంగా ఆలోచించామని చెప్పారు. తరగతి గదిని నీటితో నింపినట్లు తెలియడం వల్ల విద్యార్థులు మళ్లీ పాఠశాలకు వస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు పిల్లలంతా చదువుకుంటూ ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారని తెలిపారు.