గోల్కొండ కోటలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ - లాఠీలకు పనిచెప్పిన పోలీసులు - Golconda Fort Violent Clash - GOLCONDA FORT VIOLENT CLASH
🎬 Watch Now: Feature Video
Published : Jul 14, 2024, 8:50 PM IST
Clash Between Two Groups in Golconda Fort : గోల్కొండ కోటలో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం, ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరిపై మరొకరు విచక్షణారహితంగా దాడులు చేసుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. సమూహాలుగా ఏర్పాడి తమ ప్రతాపాన్ని చూపిస్తుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో రెండు గ్రూపుల వారు అక్కడి నుంచి పరారయ్యారు.
Police Baton Charge to Disperse Groups : కాగా బోనాలు సందర్భంగా కోలాహలంగా ఉన్న గోల్కొండ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా రణరంగంగా మారడంతో, గొడవ చూసిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. బోనాలు పండుగ వేళ ఇటువంటి ఘర్షణలు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపాలని, పోలీస్ బందోబస్తు పెంచి మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. మరోవైపు ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.