మియాపూర్‌లోని పాఠశాలలో చెడ్డీ గ్యాంగ్ చోరీ - రూ.7.85 లక్షలు దోచుకెళ్లిన దుండగులు - Cheddigang robbery at Miyapur
🎬 Watch Now: Feature Video
Published : Mar 17, 2024, 10:30 PM IST
Cheddigang Robbery at School in Miyapur : మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ చోరీ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే హఫీజ్‌పేట్‌లోని వరల్డ్ వన్ స్కూల్‌లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పాఠశాల ఆఫీసులోని క్యాష్ కౌంటర్ నుంచి నగదును చోరీ చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా, చెడ్డీ గ్యాంగ్ పనిగా గుర్తించారు. ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతో వచ్చిన దొంగలు, స్కూల్ కార్యాలయంలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ఘటనలో క్యాష్ కౌంటర్ నుంచి రూ.7 లక్షల 85 వేల నగదును దోచుకున్నట్లుగా పాఠశాల యాజమాన్యం పేర్కొంది. సదరు ఘటనపై మియాపూర్ పోలీసులకు స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని నగదు రికవరీ చేస్తామన్నారు.