ఫలితాల వేళ భాగ్యలక్ష్మి అమ్మవారికి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు - Kishan Reddy Special Pooja - KISHAN REDDY SPECIAL POOJA
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 9:07 AM IST
Kishan Reddy Special Pooja At Bhagyalakshmi Temple Charminar : లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయభేరి మోగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ ఆయన హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ, పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగుతుందని నమ్మకం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.
ఈ సారి కూడా కేంద్రంలో ప్రజలు మోదీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో అత్యధిక స్థానాలు కమలం పార్టీకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే కమలం తమను గెలిపిస్తుందన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా భారతీయ జనతా పార్టీకే అత్యధిక మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. మూడోసారి మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టునున్నారని తెలిపారు. ఈ నెల రెండో వారంలో బాధ్యతలు చేపట్టే అవకాశముందని చెప్పారు. దేశం సుభిక్షంగా ఉండాలి అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని వ్యాఖ్యానించారు.