ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు - కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ - IPS Cadre Strength in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 1:46 PM IST
IPS Cadre Strength in AP : ఆంధ్రప్రదేశ్‌కు ఐపీఎస్‌ల సంఖ్యను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్‌లను 174కు పెంచింది. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మందిని కేటాయించాలన్న రాష్ట్రం సిఫార్సుతో, వీరి సంఖ్యను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్‌గా 38 మంది కేటాయించాలని సూచించింది. రాష్ట్రాలకు డిప్యుటేషన్ రిజర్వ్‌గా 23 మందిని కేటాయించింది.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హెచ్ఓపీఎప్ ఒక పోస్టు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఏసీబీ ఒక పోస్టు, డీజీ ప్రిజన్స్, డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీసెస్‌తో పాటు అదనపు డీజీ ఇంటిలిజెన్స్, సీఐడీ, శాంతి భద్రతలు, సంస్థాగత వ్యవహారాలు సిబ్బందికి ఒక్కో కేడర్ పోస్ట్‌ను నిర్దేశిస్తూ కేంద్రం నోటిఫై చేసింది. విజయవాడ, విశాఖ సీపీ పోస్టులు ఐజీ ర్యాంక్‌కే పరిమితం చేసింది. ఈ క్రమంలోనే రేంజ్ డీఐజీల ర్యాంక్ ఐజీ స్థాయికి కేంద్ర ప్రభుత్వం పెంచింది.