నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు - డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం - Car Fire Accident in Medak - CAR FIRE ACCIDENT IN MEDAK
🎬 Watch Now: Feature Video
Published : May 5, 2024, 12:02 PM IST
Car Fire Accident in Medak : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి ఎన్‌హెచ్ - 161పై వెళుతున్న ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటికి దిగేశారు. హైదరాబాద్ నుంచి నారాణయఖేడ్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
తొలుత కారు బ్యాలెట్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ కారు ఆపి కిందకు దిగాడు. పొగలు ఎక్కువ కావడంతో ప్రయాణికులను అప్రమత్తం చేసి వారిని కిందకు కిందకు దింపాడు. తర్వాత దట్టమైన పొగలు అలుముకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. వేసవి కాలంలో వేడికి కొన్ని సందర్భాల్లో మంటలు చెలరేగుతాయని వారు తెలిపారు. వీలైనంత వరకు వాహనాలను నీడలో ఉంచాలని సూచించారు. ఎలక్ట్రికల్ వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.