టోల్ గేట్ ఉద్యోగి పైనుంచి దూసుకెళ్లిన కారు - Car Crushed Worker Viral Video - CAR CRUSHED WORKER VIRAL VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Jun 7, 2024, 2:45 PM IST
Car Crushed Worker Viral Video : ఉత్తర్‌ప్రదేశ్ హాపుర్ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. టోలో ప్లాజాలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిని అతివేగంతో ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని చిత్రకూట్‌కు ప్రాంతానికి చెందిన హేమరాజ్ అనే వ్యక్తి చిజరాసి టోల్‌ప్లాజాలో పనిచేస్తున్నాడు. గురువారం వేకువజామున మూడు గంటలకు ఓ కారు టోల్‌ప్లాజా వైపు వచ్చింది. ఆ సమయంలో హేమరాజ్ విధుల్లో ఉన్నాడు. ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకునేందుకు సదరు డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో కారును ఆపేందుకు హేమరాజ్ ప్రయత్నించాడు.
అదే సమయంలో అతివేగంతో హేమరాజ్‌ను ఢీకొని దూసుకెళ్లింది కారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడి ఎగిరిపడ్డాడు. వెంటనే స్థానికులు, సహద్యోగులు హేమరాజ్‌ను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.