ఉప్పల్​లో రోడ్డు ప్రమాదం - మంటలు చెలరేగి కారు దగ్ధం - ఇద్దరు యువకులకు గాయాలు - Car Accident In Uppal Hyderabd - CAR ACCIDENT IN UPPAL HYDERABD

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 10:39 AM IST

Car Accident in Uppal Hyderabd : ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న పాటి నిర్లక్ష్యం కారణాంగా ఏకంగా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. హైదరాబాద్​లోని ఉప్పల్​లో తెల్లవారుజామున ఓ కారు ప్రమాదానికి గురైంది. చిక్కడపల్లికి చెందిన సాయి శ్రీకర్ (19) నిఖిల్ (19) రాత్రి 3 గంటల ప్రాంతంలో నాగోల్ నుంచి హబ్సిగూడ వైపు వెళ్తున్నారు. కారు నడుపుతున్న సాయి శ్రీకర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కారు ఏక్ మినార్ మసీదు ఉప్పల్ స్టేడియం సమీపంలో వీధి లైట్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు నుంచి మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అందులో ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వేసవి వచ్చిందంటే గుర్తొచ్చేవి విహారయాత్రలు. కుటుంబ సమేతంగా సొంత వాహనాల్లో పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఆనందంగా గడిపి వస్తుంటారు. ఈ క్రమంలో వాహన నిర్వహణ చేయకుంటే ఇబ్బందులు పడతారు. దూర ప్రాంతాలకు కాలం చెల్లిన టైర్లు ఉన్న వాహనాల్లో వెళ్లడం, సమయానికి ఇంజిన్‌ ఆయిల్‌ మార్చకపోవడం తదితర కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతేడాది నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 8,776 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. విద్యార్థులకు పరీక్షలు పూర్తవ్వడంతో నగరవాసులు విహార యాత్రలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ముందు వాహన పని తీరును పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.