LIVE :​ ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు - ప్రత్యక్షప్రసారం - MLA Lasya Nanditha

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 9:05 AM IST

Updated : Feb 23, 2024, 7:31 PM IST

Cantonment MLA Lasya Nanditha Passed Away Live : పటాన్​చెరు ఓఆర్​ఆర్​పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఘటనాస్థలిలోనే అక్కడికక్కడే ఎమ్మెల్యే మృతి చెందారు. కారు డ్రైవర్​కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కారు వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి రెయిలింగ్​ను ఎమ్మెల్యే నందిత కారు ఢీకొట్టింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో ఆమె తండ్రి దివంగత నేత సాయన్న అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇప్పుడు ఈమె ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు రోధిస్తున్నారు. ఆమె మృతి పట్ల సీఎం రేవంత్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మరోవైపు ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే కేటీఆర్​ కూడా విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే బీఆర్​ఎస్​ సీనియర్​ నేత హరీశ్​రావు ఆస్పత్రికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Last Updated : Feb 23, 2024, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.