కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడానికి అంతా సహకరించాలి : నివేదిత - Cantonment by Election - CANTONMENT BY ELECTION
🎬 Watch Now: Feature Video
Published : Apr 11, 2024, 10:39 PM IST
Cantonment BRS MLA Candidate Niveditha on Elections : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడానికి అంతా సహకరించాలని బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత కోరారు. ఏడాది వ్యవధిలో తండ్రి సాయన్న, సోదరి లాస్య నందితను కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బోయిన్పల్లిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సహా కార్యకర్తలు పాల్గొన్నారు.
BRS Meeting on Secunderabad Cantonment By Election : తనకు అవకాశం ఇస్తే తన తండ్రి సాయన్న బాటలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నివేదిత అన్నారు. ఈ క్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయమని రాజశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏడాది వ్యవధిలోనే దివంగత నేత సాయన్న, లాస్య నందిత చనిపోవడం బాధకరమని అన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేయాలని కార్యకర్తలను సూచించారు.