అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు - క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు - సంగారెడ్డిలో బస్సు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Published : Feb 7, 2024, 2:09 PM IST
Bus Accident in Sangareddy : సంగారెడ్డి జిల్లా రాళ్లకత్వలో నర్సాపూర్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ప్రయాణికులు అతడిపై దాడి చేశారని పేర్కొన్నాడు. అనంతరం ఆయనను కారులో ఆస్పత్రికి తరలించారని కండక్టర్ తెలిపాడు.
RTC BUS Accident at Rallakatwa : అసలు బస్సు ఎందుకు అదుపు తప్పిందనే విషయం తెలియదని ప్రయాణికులు పేర్కొన్నారు. స్థానికులు ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ప్రయాణికుల వద్ద వివరాలు సేకరించారు. ప్రయాణికులు ఇచ్చిన వివరాల మేరకు జిన్నారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.