బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై ఎద్దు దాడి- ట్రక్కు డ్రైవర్ అలర్ట్‌తో ప్రాణాలు సేఫ్! - Bull Attack Man - BULL ATTACK MAN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-04-2024/640-480-21152457-thumbnail-16x9-bull-suddenly-attacks-a-biker-on-the-road-in-karnataka-bengaluru.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Apr 5, 2024, 2:24 PM IST
Bull Attack On Man Viral Video : కర్ణాటకలోని బెంగళూరులో ఓ వ్యక్తికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మహాలక్ష్మీ స్విమ్మింగ్‌పూల్ రోడ్లో బైక్‌పై వెళ్తున్న అతడిపై ఉన్నట్టుండి ఓ ఎద్దు దాడి చేసింది. దీంతో అతడు ఎగిరి ఎదురుగా వస్తున్న ట్రక్కు కింద పడిపోయాడు. ఇది గమనించిన ట్రక్కు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.
రఘు అనే వ్యక్తి స్కూటీపై రోడ్డుపై వెళ్తున్నాడు. ఇదే సమయంలో గంగిరెద్దును పట్టుకుని ఓ మహిళ అటుగా వస్తుంది. ఈ క్రమంలోనే ఎద్దు ఉన్నట్టుండి రఘును తన కొమ్ములతో గుద్దింది. దీంతో అతడు ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు కింద పడిపోయాడు. రఘు తన వాహనం కింద పడడాన్ని చూసిన డ్రైవర్ ఒక్కసారిగా ట్రక్కును అదుపులోకి తెచ్చాడు. దీంతో రఘ ప్రాణాలతో సురక్షితంగా ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కాగా, ఈ ఘటన గతవారం జరిగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎద్దు దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.