LIVE : వేములవాడలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం - KTR IN VEMULAWADA LIVE - KTR IN VEMULAWADA LIVE
🎬 Watch Now: Feature Video


Published : Apr 28, 2024, 1:40 PM IST
|Updated : Apr 28, 2024, 2:12 PM IST
KTR Election Campaign in Vemulawada Live : లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నేరుగా జనాల్లోకి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వాడీవేడీ ఉపన్యాసాలతో ఒక్కసారిగా సమ్మర్ హీట్ కంటే రాజకీయ హీట్‌ను పెంచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వేములవాడలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బూత్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈసారి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్‌ను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా, పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని వేడుకున్నారు.
Last Updated : Apr 28, 2024, 2:12 PM IST