LIVE : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటర్వ్యూ - BRS CHIEF KCR INTERVIEW LIVE - BRS CHIEF KCR INTERVIEW LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-05-2024/640-480-21405198-thumbnail-16x9-kcr.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : May 7, 2024, 9:00 AM IST
|Updated : May 7, 2024, 10:23 AM IST
BRS President KCR Interview with ETV Bharat LIVE : ఎలాగైనా తనను ఓడించాలన్న ధ్యేయంతో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్‌కి సహకరించిందని భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఏ కేసులోనైనా ఇరికించాలని ప్రధాని మోదీ తీవ్రంగా ప్రయత్నించారని, ఎక్కడా అవినీతి లేకపోవడం వల్లే తాను దొరకలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన కాంగ్రెస్ పార్టీకి శాపం అవుతుందన్నారు. ఆయన దేవుళ్లపై ఒట్టు పెట్టుకోవడం ఇబ్బందికర పరిణామంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఇప్పటికే హేహ్యభావం కనిపిస్తోందని, పొర్లు దండాలు పెట్టినా రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ 12 కు మించి ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని, బీఆర్ఎస్ అపుడు సందర్భోచిత నిర్ణయం తీసుకుంటుందంటుని ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్ తెలిపారు.
Last Updated : May 7, 2024, 10:23 AM IST