మేడిగడ్డపై మీనమేషాలు లెక్కపెట్టకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలి : ఎంపీ సురేశ్ రెడ్డి - మేడిగడ్డపై ఎంపీ సురేశ్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video


Published : Mar 2, 2024, 11:48 AM IST
BRS MP Suresh Reddy on Medigadda : ప్రభుత్వాలు అనేవి నిరంతర ప్రక్రియ అని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. ఒక పార్టీ వస్తుంది, మరో పార్టీ పోతుందని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించామని వివరించారు. మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయి తప్ప, మిగతా బ్యారేజీ మొత్తం బాగానే ఉందని అన్నారు. కానీ బాధ్యతతో మరమ్మతులు చేయాల్సిన తెలంగాణ సర్కార్ మేడిగడ్డ విషయంలో పూర్తి అలక్ష్యాన్ని కనబరుస్తోందని కేఆర్ సురేశ్‌రెడ్డి ఆరోపించారు.
BRS Leaders Visit Medigadda : ఆనకట్టలో కేవలం మూడు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని, ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టకుండా పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని సురేశ్‌రెడ్డి తెలిపారు. బ్యారేజీలో నీరు లేదు కాబట్టి త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరించాలని సూచించారు. నీళ్లు ఎత్తిపోస్తే అన్నదాతలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తమ పార్టీ స్పష్టంగా చెబుతుందని అన్నారు. వచ్చే వానాకాలంలో వరద వచ్చేనాటికి బ్యారేజీని పునరుద్ధరించాలని అంటున్న కేఆర్ సురేశ్‌రెడ్డితో ముఖాముఖి.