దిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత - Kavitha to Reach Hyderabad Today - KAVITHA TO REACH HYDERABAD TODAY
🎬 Watch Now: Feature Video
Published : Aug 28, 2024, 3:43 PM IST
|Updated : Aug 28, 2024, 3:52 PM IST
BRS MLC Kavitha to Reach Hyderabad Today : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. మంగళవారం రాత్రి బెయిల్‌పై తిహాడ్ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. రాత్రి దిల్లీలోనే ఉన్న వసంత విహార్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో బస చేశారు. అనంతరం బుధవారం ఉదయం రౌస్ ఎవెన్యూ కోర్టులో జరిగిన విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై విచారణ జరగ్గా, కొన్ని పత్రాలు సరిగ్గా లేవని, కోర్టు రికార్డుల నుంచి స్పష్టంగా ఉన్న దస్త్రాలను ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు.
సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్‌ను అందించాలని జడ్జి కావేరి భవేజా కోర్టు అధికారులకు సూచించారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. విచారణ అనంతరం వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయం నుంచి దిల్లీ ఎయిర్‌పోర్టుకు ఎమ్మెల్సీ కవిత బయల్దేరారు. అక్కడ హైదరాబాద్ వెళ్లే విమానం కవిత ఎక్కారు. సాయంత్రానికి భాగ్యనగరానికి రానున్నారు.