LIVE : తెలంగాణ భవన్‌లో జగదీశ్‌రెడ్డి మీడియా సమావేశం - MLA Jagdish Reddy Live - MLA JAGDISH REDDY LIVE
🎬 Watch Now: Feature Video


Published : Jun 16, 2024, 12:19 PM IST
|Updated : Jun 16, 2024, 1:13 PM IST
MLA Jagdish Reddy Live : రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతోనే విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో ఈ తరహాలో ఏర్పాటు చేసిన చాలా కమిషన్లు ఏమయ్యాయో అందరికీ తెలుసునన్నారు. అప్పటి ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొందని, దేశంలో మంచి చరిత్ర ఉన్న బీహెచ్ఈఎల్ సంస్థకు పనులు అప్పగించిందని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ సంస్థ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. గత ప్రభుత్వ గొప్ప విద్యుత్ విజయాలను సాధించిన దురుద్దేశాలను ఆపాదిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేసిందని మండిపడుతున్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందన్నారు. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమని ఆరోపిస్తున్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని విమర్శింస్తున్నారు. తాజాగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతున్నారు.
Last Updated : Jun 16, 2024, 1:13 PM IST