LIVE : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - Telangana Bhavan Live
🎬 Watch Now: Feature Video


Published : Feb 29, 2024, 5:27 PM IST
|Updated : Feb 29, 2024, 6:05 PM IST
Telangana Bhavan LIVE : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ,ఆ కుట్రలను తిప్పికొట్టేందుకే చలో మేడిగడ్డకు పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. రేపటి పర్యటనపై ఇవాళ బీఆర్ఎస్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని ఎండబెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తోందని, జరిగిన ప్రతి పనిలోనూ అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. కాళేశ్వరం అతి పెద్ద అవినీతి అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏమైనా విచారణ అధికారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్థూపాన్ని తొలగిస్తారా అని ప్రశ్నించారు. మేడిగడ్డపై మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే మేడిగడ్డను పునరుద్ధరించి పంటలకు నీటిని పంపిణీ చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌పై ఉన్న కోపం రైతులపై చూపవద్దని, సాగు, తాగు నీటి కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.
Last Updated : Feb 29, 2024, 6:05 PM IST