LIVE : తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం
🎬 Watch Now: Feature Video
BRS press meet LIVE : నేడు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అధికార కాంగ్రెస్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు(BRS Walkout) సభ నుంచి బయటకు వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ వైఖరిపై నిరసనగా కంచెల రాజ్యం, పోలీసుల రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నినాదాలు చేశారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు మాట్లాడడానికి సభలో అవకాశం ఇవ్వరు, మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా? అని పోలీసులను ప్రశ్నించారు. అనుమతి ఇస్తారా? కంచెలు బద్దలు కొట్టాలా? అని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగని విధంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.