LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - BRS Leaders Press Meet - BRS LEADERS PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : Jul 15, 2024, 1:01 PM IST
|Updated : Jul 15, 2024, 1:19 PM IST
BRS Leaders Press Meet at Telangana Bhavan : ఆదివారం రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. లష్కర్‌గూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం గీత కార్మికులకు ఎలాంటి లాభం చేకూర్చలేదని సీఎం ధ్వజమత్తారు. గౌడన్నలు తాటి చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదాలు బారినపడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా సేఫ్టీ కిట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఎవరెస్టు ఎక్కిన వారి సూచనలు తీసుకుని సేఫ్టీ కిట్ రూపకల్పన చేశామని చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ గౌడన్నలకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించుకున్నామని అన్నారు. అయితే ఆదివారం రంగారెడ్డి జిల్లాలో జరిగిన కాటమయ్య సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం గురించి బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడన్నలకు అనేక పథకాలను తీసుకువచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
Last Updated : Jul 15, 2024, 1:19 PM IST