LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - BRS Leaders Press Meet - BRS LEADERS PRESS MEET
🎬 Watch Now: Feature Video


Published : Jun 22, 2024, 1:05 PM IST
|Updated : Jun 22, 2024, 1:45 PM IST
BRS Leaders Press Meet at Telangana Bhavan : బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఎంతో ముద్దుగా పోచారాన్ని లక్ష్మీ పుత్రుడు అని పిలుచుకునేవారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. పార్టీలో అందరికీ పోచారంలా ఉండాలని సూచించేవారని తెలిపారు. కానీ మీరు ఈనాడు పార్టీ మారడం హేయంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు అందరూ పోచారం వ్యవహారంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ మేరకు అందుకు ఆయన ఒప్పుకుంటూ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం రేవంత్ ఆహ్వానించారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పోచారం ఇంటి వద్ద నిరసనలు తెలిపారు.
Last Updated : Jun 22, 2024, 1:45 PM IST